Manoj Kumar: బాలీవుడ్ లో విషాదం..మనోజ్ కుమార్ కన్నుమూత 6 d ago

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు మనోజ్ కుమార్ (87) శుక్రవారం ముంబైలో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1937లో జన్మించిన ఆయన, 1957లో 'ఫ్యాషన్' మూవీ తో ఇండస్ట్రీ లోకి వచ్చారు. భరత్ కుమార్ గా ప్రసిద్ధి చెందారు. 'ఉప్కర్', 'పూరబ్ ఔర్ పశ్చిమ్', 'రోటీ కపడా ఔర్ మకాన్' వంటి దేశభక్తి చిత్రాలతో ప్రసిద్ధి చెందారు. 1992లో పద్మశ్రీ, 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను పొందారు.